క్రిములు పారిపోతాయిలా..!

ABN , First Publish Date - 2020-07-17T05:30:00+05:30 IST

‘‘చేతులు సరిగ్గా కడుక్కోకపోతే క్రిములు అలాగే ఉంటాయి. అదే చేతులు శుభ్రం చేసుకుంటే ఇదిగో ఇలా పారిపోతాయి’’ అంటూ టీవీలో వచ్చే ప్రకటన మీరు చూసే ఉంటారు కదా! మీరూ నీళ్లలో వేలు పెట్టగానే క్రిములు అలాగే పారిపోతాయి...

క్రిములు పారిపోతాయిలా..!

‘‘చేతులు సరిగ్గా కడుక్కోకపోతే క్రిములు అలాగే ఉంటాయి. అదే చేతులు శుభ్రం చేసుకుంటే ఇదిగో ఇలా పారిపోతాయి’’ అంటూ టీవీలో వచ్చే ప్రకటన మీరు చూసే ఉంటారు కదా! మీరూ నీళ్లలో వేలు పెట్టగానే క్రిములు అలాగే పారిపోతాయి. ఆ ట్రిక్‌ మీకూ నేర్చుకోవాలని ఉందా? అయితే ఇలా చేయండి.


కావలసినవి :

  1. ఒక వెడల్పాటి బౌల్‌
  2. నీళ్లు
  3. పెప్పర్‌
  4. సబ్బు


ఇలా చేయాలి...

  1. ఒక బౌల్‌లో నీళ్లు పోయండి. పొడి చేసిన పెప్పర్‌ను అందులో చల్లండి. ఇక్కడ పెప్పర్‌ క్రిములన్నమాట.
  2. ఒక స్నేహితుడిని పిలిచి అందులో వేలు పెట్టమని చెప్పండి. అతను వేలు పెట్టినా ఏమీ జరగదు.
  3. అతడికి తెలియకుండా మీ వేలును సబ్బుపై రుద్దిపెట్టుకోండి.
  4. ఇప్పుడు మీ వేలును నీటిలో పెట్టండి. ఒక్కసారిగా పెప్పర్‌ మొత్తం దూరంగా జరిగిపోతుంది.
  5. మీరు సబ్బుతో రుద్దుకున్న విషయం స్నేహితునికి తెలియకుండా చూసుకుంటే చాలు.

Updated Date - 2020-07-17T05:30:00+05:30 IST