Abn logo
Sep 25 2021 @ 23:45PM

తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

ఇచ్ఛాపురం రూరల్‌: డొంకూరు గ్రామస్థులతో మాట్లాడుతున్న రూరల్‌ ఎస్‌ఐ హైమావతి

ఆమదాలవలస: తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధం గా ఉండాలని కమిషనర్‌ ఎం.రవిసుధాకర్‌ ఆదేశించారు. శనివారం మునిసిపల్‌ కార్యాలయంలో  అధికారులతో సమీక్షించారు.  కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు అత్యవసర సేవలకు   9849906976నంబరకు ఫోన్‌చేయాలని కోరారు. సమావేశంలో ఏఈ కె.అప్పలనాయుడు పాల్గొన్నారు. ఫ ఇచ్ఛాపురం రూరల్‌ :   తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో  ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రూరల్‌ ఎస్‌ఐ బి.హైమావతి తెలిపారు.  శనివారం డొంకూరలో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేశారు. 

 పోలీసు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: గులాబ్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా కేంద్రంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అమిత్‌బర్దర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తుఫాన్‌ సమయంలో ఎలాంటి సహాయం, సమాచారం కావాలన్న 6309990933 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.