అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-05-29T11:16:43+05:30 IST

అప్రమత్తంగా ఉంటూ మావోయిస్టుల ఉనికిపై నజర్‌ వేయాలని వరంగల్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌

అప్రమత్తంగా ఉండండి

మావోయిస్టుల ఉనికిపై నజర్‌ వేయండి

వరంగల్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌


భూపాలపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి) : అప్రమత్తంగా ఉంటూ మావోయిస్టుల ఉనికిపై నజర్‌ వేయాలని వరంగల్‌ ఐజీ ప్రమోద్‌కుమార్‌ అన్నారు. భూపాలపల్లి ఎస్పీ కార్యాలయంలో ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీసు అధికారులతో ఆయన గురువారం సమావేశ మై ఆయా అంశాలను సమీక్షించారు.ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్ర సరి హద్దుగా ఉభయ జిల్లాలు ఉన్నాయని, అక్కడ మావోయిస్టులు విధ్వంసాలకుపాల్పడుతున్న నేప థ్యంలో పోలీసులు అప్రమత్తం గా ఉండాలని అన్నారు. సరిహద్దులో కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం లాంటి భారీ ప్రాజెక్టు లు ఉన్నాయని, వాటికి భద్రత పెంచాలని సూచించారు. మావోయిస్టు ల ఉనికి రెండు జిల్లాలో కనిపించకుండా సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు.


సరిహద్దు దాటి మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించకుండా దృష్టి పెట్టాలన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రజలకు పోలీసులు మరింతా సహకారాన్ని అందించాలని కోరారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూ పాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తూ ప్రజలతో మమేకం కావాలన్నారు. రెండు జిల్లాల్లో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళలో గస్తీపెం చాలన్నారు. శాంతిభద్రతలను కాపాడుతూ సమర్థంగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశంలో ములుగు ఎస్పీ సంగ్రామ్‌సిం గ్‌జీపాటిల్‌, భూపాలపల్లి ఏఎస్పీ శ్రీనివాసులు, ఏటూరునాగారం, ములుగు ఏఎస్పీలు శరత్‌చంద్ర పవార్‌, సాయి చైతన్య, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌కుమార్‌, కాటా రం డీఎస్పీ బోనాల కిషన్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:16:43+05:30 IST