సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-22T05:38:13+05:30 IST

మొక్కల పెంపకం, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషినల్‌ కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి, బోర్గం గ్రామాల్లో శానిటేషన్‌ పనులను ఆమె తనిఖీ చేశారు.

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, జూన్‌ 21 : మొక్కల పెంపకం, సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అడిషినల్‌ కలెక్టర్‌ లత అన్నారు. సోమవారం రెంజల్‌ మండలం తాడ్‌బిలోలి, బోర్గం గ్రామాల్లో శానిటేషన్‌ పనులను ఆమె తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున్న పల్లెప్రకృతి వనాన్ని ఆమె పరిశీలించారు. డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ఆర్‌ఐపీ రోడ్లు గుంతలమయం లేకుండా చూసుకోవాలని, రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటాలని సూచించారు. ఉపాధిహామీ పథకం కింద ఎక్కడైతే పనులు అవసరం ఉందో అక్కడ పనులు చేయించాలని ఎంపీడీవోకు సూచించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని పలు రికార్డులను తనిఖీ చేశారు. గర్భవతులకు, బాలింతలకు పౌష్ఠిక ఆహారం ఎలా అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో శుభ్రం లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆమె కార్యదర్శులకు హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ, బోర్గం సర్పంచ్‌ వాణి, ఎంపీడీవో గోపాలకృష్ణ, ఎంపీవో గౌసుద్దీన్‌, పంచాయతీ కార్యదర్శులు తదితరులున్నారు. 

Updated Date - 2021-06-22T05:38:13+05:30 IST