సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-10-17T05:06:47+05:30 IST

ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్‌ రామిరెడ్డి పేర్కొన్నారు.

సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

రాజంపేట, అక్టోబరు16 : ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ, చికెన్‌గున్యా వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకుడు డాక్టర్‌ రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం రాజంపేట పట్టణంలోని మన్నూరు, ఉస్మాన్‌నగర్‌, రామ్‌నగర్‌, ప్రాంతాలలో డెంగ్యూ చికన్‌, గున్యా ప్రత్యేక నివారణపై ఆ ప్రాంతంలో పర్యటించి విషయాలు తెలుసుకున్నారు.   ఆరోగ్య కార్యకర్తలు, ఆశావర్కర్లు, వలంటీర్లు, శానిటరీ సిబ్బం ది పనితీరును పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సానె శేఖర్‌, అసిస్టెంట్‌ మలేరియా అధికారి రామచంద్రారెడ్డి, సబ్‌ యూనియన్‌ అధికారి ఎస్‌.ఎ్‌స.దాస్‌, ఎంపీహెచ్‌ఈవో పాలపుల్లయ్య, ఇంతియాజ్‌,  వైద్యులు వెంగల్‌రెడ్డి యల్లారెడ్డి, శ్రీనివాసులు,  పొలిచర్ల ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:06:47+05:30 IST