Abn logo
May 21 2020 @ 04:43AM

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్‌ కె శశాంక


కరీంనగర్‌, మే 20 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): cబుధవారం కలెక్టరేట్‌లో వైద్యాధికారులు, మున్సిపల్‌ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, విషజ్వరాల పట్ల వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా దోమల నివారణపై ప్రత్యేక దృష్టిసారించాలని అన్నారు. జూలైలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటా యన్నారు.


గ్రామాలలో పంచాయతీ సెక్రెటరీలు ఎప్పటికప్పుడు వీధులను పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అన్నారు. అలాగే కాలువల, రోడ్లపై నీటి నిలువలు లేకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలోనే కాక గ్రామాలలో కూడా ఫాగింగ్‌చేయాలని అన్నారు. అందుకు అవసరమైన రసాయనాలను మున్సిపాలిటీల నుంచి సమకూర్చొకోవాలని అన్నారు. మురుగు కాలువలలో ప్రతిరోజు రసాయనాలను పిచికారి చేయాలని అన్నారు.


తద్వారా చాలా వరకు దోమలను లార్వా దశలోనే నిర్మూలించవచ్చనని అన్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ పాఠశాలలు, కళాశాలలో సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తూ పరిశుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మేజర్‌ పంచాయతీలలలో పందులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్‌ కమిషనర్‌ వల్లూరి క్రాంతి, జడ్పీసీఈవో వెంకటమాధవరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, ప్రభుత్వ హాస్పిటల్‌ సూపరిండెంట్‌ అజయ్‌కుమార్‌, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రావు, జిల్లా మలేరియా అధికారి పాల్గొన్నారు.

Advertisement
Advertisement