సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2021-12-04T06:23:50+05:30 IST

సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప, ఎస్కేయూ వీసి రామకృష్ణారెడ్డి పే ర్కొన్నారు.

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండండి
మాట్లాడుతున్న ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప

జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, డిసెంబరు 3: సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప, ఎస్కేయూ వీసి రామకృష్ణారెడ్డి పే ర్కొన్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం సైబర్‌ సేఫ్టీ, సెక్యూరిటీ వర్క్‌షాఫ్‌ ని ర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ, వీసీ హాజరయ్యారు. ముందుగా ఓటీపీ, జాబ్‌, ఈ-మొయిల్‌, లక్కీడ్రా, లాటరీ తదితర రూపాల్లో జరిగే మోసాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆనలైన లావాదేవీలు చేసే సమయం లో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. పోలీసులు కూడా ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సైబర్‌ నేరాలపై ఎప్పటికప్పుడు పోలీసులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకింగ్‌ సేవలను ఎక్కువశాతం బ్యాంకులకు వెళ్లి చేసుకోవడం ఉత్తమమన్నారు. వ్యక్తిగత వివరాల కోసం అనుమానాస్పద వ్యక్తులు ఆశ్రయిస్తే తగిన విధంగా స్పందించాలన్నారు. కార్యక్రమంలో వైవీఎ్‌సఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సురేష్‌, జగదీష్‌, ఏఎస్పీలు నాగేంద్రుడు, రామకృష్ణప్రసాద్‌, హనుమంతు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, క్యాట్‌ సిబ్బంది, సైబర్‌ బృందాలు, ఐటీకోర్‌, సర్వేలెన్సు బృందాలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-04T06:23:50+05:30 IST