సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-18T03:51:35+05:30 IST

వర్షాకాలంలో సీజనల్‌, అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ భారతి హొళికేరి

కలెక్టర్‌ భారతి హొళికేరి

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 17 : వర్షాకాలంలో సీజనల్‌, అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి నీటి తొలగింపు చర్యలు చేపట్టాలని, తాగునీటి బావుల్లో క్లోరినేషన్‌ చేయాలని తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీలో కీటక జనిత వ్యాధుల వ్యాప్తి, నివారణ చర్యలపై అవగాహన కల్పించే విధంగా గోడప్రతులు ప్రదర్శించాలని, జిల్లాకు 31 వేల 600 దోమ తెరలు వచ్చాయని, వీటిని ఆయా ప్రభావిత గ్రామాల్లో అవ సరం ఉన్నవారికి అందజేయాలన్నారు. మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనారోగ్య సమాచారం తెలిసిన వెంటనే ఆ ప్రాంతంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ ప్రాం తాల్లో డెంగ్యూ వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రోడ్ల కూడళ్ళు, జన సంచారం ఉన్న ప్రాం తాల్లో గోడప్రతుల ద్వారా అవగాహన కల్పించాల న్నారు. 

నివాస, పరిసర ప్రాంతాలలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సుబ్బారాయుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు, జిల్లా సంక్షేమ శాఖ ఉమాదేవి, జిల్లా గ్రామీణ నీటి పారుదల అధికారి అంజన్‌కుమార్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి, మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, మలేరియా ప్రోగ్రామ్‌ అధికారి డా.అనిత, జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T03:51:35+05:30 IST