కరోనాపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-01-21T04:33:38+05:30 IST

ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీంఖలీల్‌, ఎంపీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి అన్నారు.

కరోనాపై అప్రమత్తంగా ఉండాలి
నిబంధనలు వివరిస్తున్న తహసీల్దార్‌ ఇబ్రహీంఖలీల్‌

రాచర్ల : ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని  తహసీల్దార్‌ షేక్‌ ఇబ్రహీంఖలీల్‌, ఎంపీడీవో సయ్యద్‌ మస్తాన్‌వలి అన్నారు. గురువారం రాచర్లలో కొవిడ్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బస్టాండ్‌లోని షాపుల యజమానులకు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించి వచ్చే వారికి కూడా మాస్కు ఉంటేనే అమ్మకాలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ మహేష్‌, విస్తరణ అధికారి విజయలక్ష్మి, ఏఎన్‌ఎం లక్ష్మీ పాల్గొన్నారు.  

ఏఎస్‌ఐ అవగాహన

పెద్ద దోర్నాల : అతివేగంగా విస్తరిస్తోన్న మూడవ విడత కరోనా వైర స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్సై నాగరాజు అన్నారు.  నటరాజ్‌ సెంటర్‌లో  కరోనాపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు.  బయటకు వచ్చే వారు మాస్కు తప్పనిసరిగా ధ రించాలన్నారు. భౌతికదూరం పాటించి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. నిత్యావసరాలు, కూరగాయల మార్కెట్ల వద్ద రద్దీ లేకుండా జాగ్రత్తప డాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. మాస్కులు లేకుండా కన్పిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-21T04:33:38+05:30 IST