పట్టణ పారిశుధ్యంపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-06-18T05:34:46+05:30 IST

వర్షాకాలం సీజన్‌ రావడంతో పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ ఆదేశించారు.

పట్టణ పారిశుధ్యంపై అప్రమత్తంగా ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌

 నర్సాపూర్‌, జూన్‌ 17: వర్షాకాలం సీజన్‌ రావడంతో పారిశుధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ మురళీధర్‌యాదవ్‌ ఆదేశించారు. గురువారం మున్సిపల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలంలో మురుగుకాల్వలు, రోడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, ఈ విషయంలో ఆయా కౌన్సిలర్లు సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు.  పలు అభివృద్ధి పనులకు త్వరలో మంత్రి హరీశ్‌రావుతో శంకుస్థాపన చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాగా  తైబజార్‌ వేలాన్ని నిర్వహించగా రూ.21.50లక్షలతో ఓ వ్యక్తి కైవసం చేసుకున్నాడని వివరించారు..  సమావేశంలో కమిషనర్‌ అశ్రిత్‌కుమార్‌, వైస్‌ఛైర్మన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-18T05:34:46+05:30 IST