వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-09-08T18:01:31+05:30 IST

మండలంలోని నమిలిగొండ..

వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి

జనగామ డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి


స్టేషన్‌ఘన్‌పూర్‌: మండలంలోని నమిలిగొండ గ్రామంలో లోలెవల్‌ కాజ్‌వే వద్ద వరద ఉధృతి తగ్గే వరకు సంబంధిత అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. మంగళవారం  ఆయన కాజ్‌వే వద్ద వరదను పరిశీలించారు. ఉధృతి తగ్గేవరకు వాహనాలను అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇళ్లలో ఎవరూ నివాసం ఉండవద్దని అన్నారు. అత్యవసరమైతే  పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని, లేదంటే డయల్‌ 100 కాల్‌ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి సహాయ చర్యలు చేపడుతారని అన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ గైక్వాడ్‌ రఘునాథ్‌ వైభవ్‌, ఘన్‌పూర్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్రీవాణి, సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సైలు మహేందర్‌, కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-08T18:01:31+05:30 IST