శ్రీశైలం సున్నిపెంటలో ఎలుగుబంటి సంచారం

ABN , First Publish Date - 2022-01-25T14:39:06+05:30 IST

శ్రీశైలం సున్నిపెంటలో ఎలుగుబంటి సంచారం

శ్రీశైలం సున్నిపెంటలో ఎలుగుబంటి సంచారం

కర్నూలు: శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో ఎలుగుబంటి సంచరించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి ఫీల్టర్ హౌస్ సెంటర్‌లో ఎలుగుబంటి హల్‌చల్ చేసిందని స్థానికులు పేర్కొన్నారు. ఎలుగుబండి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారంలో రెండు ఎలుగుబంట్లను పట్టుకున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్పారు. మరో ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో టపాసులు పేలుస్తూ అడవిలోకి తరిమేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.


Updated Date - 2022-01-25T14:39:06+05:30 IST