బీటీ రోడ్డు శంకుస్థాపన దిమ్మె ధ్వంసం

ABN , First Publish Date - 2021-01-19T05:14:58+05:30 IST

దమ్మపేటలో బీటీ రహదారి నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించాల్సిన శంకుస్థాపన దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.

బీటీ రోడ్డు శంకుస్థాపన  దిమ్మె ధ్వంసం
ధ్వంసం అయిన శంకుస్థాపన దిమ్మె

 హుటాహుటిన పునర్నిర్మించిన అధికారులు 

 యథావిధిగా శంకుస్థాపన చేసిన 

రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌

దమ్మపేట, జనవరి 18: దమ్మపేటలో బీటీ రహదారి నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆవిష్కరించాల్సిన శంకుస్థాపన దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. రూ.2.5కోట్ల తో చేపట్టిన అచ్యుతాపురం-దమ్మపేట బీటీ రహదారి నిర్మాణానికి సోమవారం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేయనుండటంతో అధికారులు ఆదివారం సాయంత్రం శంకుస్థాపన దిమ్మెను నిర్మించారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆ శంకుస్థాపన దిమ్మను ధ్వంసం చేశారు. ఉదయాన్నే ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే దిమ్మెను తిరిగి నిర్మించారు. తరువాత శంకుస్థాపన కార్యక్రమం యథా విధిగా జరిగింది. ఎంపీ నామా  నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఈ రహదా రికి శంకుస్థాపన చేశారు. దిమ్మె కూల్చివేత ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 



Updated Date - 2021-01-19T05:14:58+05:30 IST