Abn logo
Sep 30 2020 @ 01:01AM

నలుపు మెరుపు

బాలీవుడ్‌ కలల రాణి కరీనా కపూర్‌కు ఏ డ్రెస్‌ వేస్తే ఆ డ్రెస్‌కే అందం వస్తుంది. ఇక నలుపు రంగు డ్రెస్‌లో అయితే ఆమె మెరుపులు చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కరీనాకు కూడా ఆ రంగంటే చాలా ఇష్టం. అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా వాటిని ధరించి మురిపిస్తుంటుంది. అలాంటిదే ఈ ఫొటో. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి... ‘బ్లాక్‌ ఈజ్‌ గుడ్‌’ అంటూ కామెంట్‌ పెట్టింది. ఇది ఎవర్‌గ్రీన్‌ కలర్‌ అని, అందులో షేడ్స్‌ అద్భుతమని పలు సందర్భాల్లో చెప్పింది కూడా! పోల్కా డాట్‌ డ్రెస్‌, ఆఫ్‌ షోల్డర్‌ మాక్సీ, స్లిప్‌ డ్రెస్‌, షార్ట్‌ బ్లేజర్‌... బ్లాక్‌ కలర్‌లో ఆమె వద్ద లేని వెరైటీ అంటూ లేదు. తనకే కాదు... అసలు ఈ రంగు ఎవరికైనా బాగుంటుందంటుందనేది కరీనా చెప్పే మాట. మీరూ ఓ లుక్కేయండి.

Advertisement
Advertisement
Advertisement