గిరిజనులకు అందని పౌష్టికాహారం

ABN , First Publish Date - 2022-01-20T04:38:19+05:30 IST

ప్రభుత్వం చెంచు గిరిజనులకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఊరించి ఉసూరు మనిపిస్తున్నాయి.

గిరిజనులకు అందని పౌష్టికాహారం

దశాబ్దకాలంగా నిలిపివేత

అనారోగ్యంతో చెంచుల అవస్థలు

పెద్ద దోర్నాల, జనవరి 19 : ప్రభుత్వం చెంచు గిరిజనులకు ప్రవేశ పెట్టిన పలు పథకాలు ఊరించి ఉసూరు మనిపిస్తున్నాయి. కొన్ని పథకాలు అర్ధంత రంగా నిలిచిపోతున్నాయి. అనాగరికతతో కునారిల్లుతున్న చెంచుగిరిజనులు పౌష్టికాహార లోపంతో అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. చిన్న వయస్సులోనే క్షయకు గురై మహిళలు రక్త హీనతతో  బాధపడు తున్నారు. గర్భం దాల్చిన నుంచి ప్రసవ సమయం వరకూ రక్త హీనతతో బాధపడుతూ చివరకు మృత్యు కౌగిట్లోకి వెళ్తున్నారు. రక్తహీనత మరణాల నుంచి గిరి జన మహిళలను కాపాడేందుకు ప్రభుత్వం సమీకృత గిరిజనాభివృద్ధి ఏజెన్సీ (ఐటీడీఏ) ద్వారా పౌష్టిక (బల వర్ధకమైన) ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.  క్షయ బాధితులు, గర్భిణులను గుర్తించి వా రికి అవసరమైన వైద్య సేవలు, పౌష్టిక ఆహారం అం దజేసి సంపూర్ణ ఆరోగ్యవంతులగా చేయడమే పథక లక్ష్యం. మొదట్లో కొన్నేళ్ల పాటు క్రమం తప్పకుండా ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఉప ప్రణాళికను ఏర్పాటు చేశామని  చెప్తూనే చెంచు గిరిజనులకు అందించే ఈ  పథకాన్ని కూడా దశాబ్ద కాలంగా నిలిపివేశారు.  

పథకం ఉద్దేశం

క్షయ బాధితులు ఆరోగ్యవంతులుగా కోలుకోవడానికీ, గర్భిణులు, బాలింతలు రక్తహీనత నుంచి బయట పడడానికి  వైద్యుల సలహా మేరకు  సేవలందిస్తూ పౌష్టికాహారం అందిస్తారు. గర్భం దాల్చిన (5వ నెలల) నుంచి బిడ్డ పుట్టిన 3వ నెల వరకూ ప్రతి నెలా పౌష్టిక ఆహారం, మందులను అందజేయడమే పథక ఉద్దేశం. 

పౌష్టికాహారం 

ప్రతి నెలా 11వ తేదీన ఒకొక్కరికీ కిలో గోధుమ పిండి, 2 కిలోల జొన్న పిండి, 2 కిలోల రాగి పిండి, 2 కిలోల కందిపప్పు, లీటర్‌ పామాయిల్‌, 250 గ్రాముల బెల్లం, 500 గ్రాముల వేరుశనగ పప్పు, కిలో శనగలు, కిలో పెసలు, 12 గుడ్లను పౌష్టికాహారంగా అంద జేస్తారు. 

చెంచుల ఆవేదన 

ఐటీడీఏ పరిధిలోని ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని గిరిజనులకు గిరిజన సహకార సంస్థ (ఐటీడీఏ) ద్వారా ప్రతి నెలా 11వ తేదీన వైద్యాధికారుల పర్యవేక్షణలో చెంచు గర్భిణులకు పౌష్టికాహారం అందజేసేవారు. అటవీ ప్రాంతంలోని చెంచు గిరిజనులు ఆర్థికంగా వెనుకబడిన వారు కావడంతో సరైన తిండి లేక అనారోగ్యంతో బక్క చిక్కి శల్యమవుతున్నారు. చిన్న తనంలోనే క్షయబారినపడి బాధపడుతున్నారు. మరో పక్క చిన్న వయస్సులోనే వివాహాలు చేసుకోవడంతో పాటు సారా సేవించడం, స్టోర్‌ బియ్యం గొడ్డుకారం తినడంతో రక్త హీనతకు గురై తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా మహిళలు ప్రసవ సమయంలో కాన్పు కష్టంగా మారడంతో పుట్టిన బిడ్డలు కూడా అనారోగ్యంతో ఉం టున్నారు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేసిన పౌష్టికాహార పంపిణీ పథకాన్ని నిలిపివేయడంపై చెంచు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రోగాలతోపాటు కరోనా కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య సేవలు అందించడంతోపాటు పౌష్టిక ఆహారాన్ని నెలనెలా అందిం చాలని గిరిజన మహిళలు కోరుతు న్నారు. 

ఆదుకుంటున్న ఆర్‌డీటీ 

సమీకృత గిరిజాభివృద్ధి ఏజన్సీ (ఐటీడీఏ) పౌష్టికాహార పంపిణీని నిలిపివేయడంతో గిరిజనుల పరిస్థితి దయనీయంగా మారింది. వారి ఇబ్బందులను గుర్తించిన  ఆర్‌డీటీ సంస్థ ఆరు నెలలకోసారి పౌష్టికాహారాన్ని చెంచులకు అందిస్తోంది. గూడెంలలో వందల కొద్దీ మహిళలు, చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ వంతు సాయంగా ఆర్‌డీటీ సంస్థ పౌష్టికాహారం, మందులను బాధిత కుటుంబాలకు అందజేస్తోంది.  అ యితే పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందించి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తిరిగి పథకాన్ని కొన సా గించాలని గిరిజనులు కోరుతున్నారు. 


Updated Date - 2022-01-20T04:38:19+05:30 IST