పనికిరాని వస్తువులను శిల్పాలుగా మలిచి..!

ABN , First Publish Date - 2021-05-07T05:30:00+05:30 IST

పనికిరాని వస్తువులంటే చెత్తలో పడేస్తాం. కానీ చండీఘడ్‌లో నెక్‌చాంద్‌ అనే వ్యక్తి పనికిరాని వస్తువులు దొరికితే వాటిని అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దుతాడు...

పనికిరాని వస్తువులను శిల్పాలుగా మలిచి..!

పనికిరాని వస్తువులంటే చెత్తలో పడేస్తాం. కానీ చండీఘడ్‌లో నెక్‌చాంద్‌ అనే వ్యక్తి పనికిరాని వస్తువులు దొరికితే వాటిని అందమైన బొమ్మలుగా తీర్చిదిద్దుతాడు. అలా అతను రూపొందించిన బొమ్మలతో కొలువైన రాక్‌ గార్డెన్‌ పర్యాటక ప్రదేశంగా మారింది.


  1. చండీఘడ్‌లోని శివాలిక్‌ హిల్స్‌ అనే ప్రాంతం మైదానంగా ఉండేది. నగరంలోని వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆ మైదానంలో పడేసేవారు. నెక్‌చాంద్‌ రోజూ అక్కడి నుంచి వ్యర్థాలను సేకరించేవాడు.
  2. బాటిల్స్‌, ఎలక్ట్రికల్‌ విడిభాగాలు, వాహనాల విడిభాగాలను సేకరించి వాటితో రకరకాల శిల్పాలు తయారుచేసే వాడు. అలా కొన్ని వందల శిల్పాలు తయారుచేశాడు నెక్‌చాంద్‌.
  3. ఈ రాక్‌గార్డెన్‌ కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడికొచ్చే పర్యాటకులు ఆ శిల్పాలను మలిచిన తీరును చూసి ఆశ్చర్యపోతుంటారు.

Updated Date - 2021-05-07T05:30:00+05:30 IST