పెదవులు తళుక్కుమనేలా...

ABN , First Publish Date - 2020-02-03T20:18:13+05:30 IST

న్యూడ్‌ లిప్‌ కలర్‌ అనేది లిప్‌స్టిక్‌ షేడ్స్‌లో ప్రత్యేకమైనది. స్మోకీ ఐస్‌ లేదా డ్యూ మేక్‌పతో సహా ఏ లుక్‌ మీదకు అయినా సరే...

పెదవులు తళుక్కుమనేలా...

న్యూడ్‌ లిప్‌ కలర్‌ అనేది లిప్‌స్టిక్‌ షేడ్స్‌లో ప్రత్యేకమైనది. స్మోకీ ఐస్‌ లేదా డ్యూ మేక్‌పతో సహా ఏ లుక్‌ మీదకు అయినా సరే న్యూడ్‌ లిప్‌స్టిక్‌ చక్కగా మ్యాచ్‌ అవుతుంది. మీరు కూడా న్యూడ్‌ లిప్‌ కలర్‌ ట్రెండ్‌లో హొయలు పోయేందుకు ఏం చేయాలంటే... 

  • ముందుగా పెదవులను శుభ్రం చేసుకోవాలి. దాంతో వాటి మీది మృతకణాలు తొలగి మృదువుగా మారతాయి. తరువాత లిప్‌ ఆయిల్‌ లేదా లిప్‌బామ్‌ రాసుకోవాలి.
  • చర్మం రంగుకు సరిపోయే లిప్‌కలర్‌ ఎంచుకోవాలి. అంతేకాదు ఆ కలర్‌ మీ పెదవుల రంగుకు సరిపోతుందా లేదా! చెక్‌ చేసుకోవాలి. అయితే ముదురు రంగు లిప్‌స్టిక్‌ రాసుకుంటే పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
  • న్యూడ్‌ లిప్‌ కలర్‌ ఒక్కటే వాడితే పెదవులు పాలిపోయినట్టుగా ఉంటాయి. అప్పుడు నేచురల్‌ కలర్‌ బ్రష్‌ వాడితే పెదవులు తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. సీసీ క్రీమ్‌ లేదా షీర్‌ ఫౌండేషన్‌ అప్లై చేసుకున్నా సరిపోతుంది.
  • లిప్‌స్టిక్‌ వేసుకోవడం అయ్యాక లైన్‌ గీసుకోవడం మర్చిపోవద్దు. లిప్‌ లైన్‌ చక్కని ఆకృతిలో వచ్చేందుకు కావాలంటే కన్‌సీలర్‌ ఉపయోగించవచ్చు.

Updated Date - 2020-02-03T20:18:13+05:30 IST