Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందాల తీరం... రాజారాంపురం

- కార్తీక ఆది, సోమవారాల్లో సందర్శకులతో సందడి

పోలాకి : అంపలాం పం చాయతీ రాజారాంపురం సాగ రతీరం కొబ్బరి తోటలు ఇసుక తిన్నెలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. కార్తీక మాసంలో సందర్శకులతో మ రింత సందడి కనిపిస్తోంది. ఈ ఆహ్లాదకర ప్రాంతం పిక్నిక్‌లకు అనువుగా ఉండడంతో నిత్యం సంద ర్శకులు వస్తుంటారు. కార్తీకంలో ఈ సంఖ్య రెట్టింపు అవుతోంది. ఆది, సోమవారాల్లో వివిధ ప్రాంతల నుంచి భారీగా జనం తరలివచ్చి ఆటపాటలతో సందడి చేస్తారు. వనసమారాధనలకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని సందర్శకులు కోరుతున్నారు. అదేవిధంగా ఇచ్ఛాపురం మండలంలోని డొంకూరు, మందస తీరంలో రట్టి, వజ్రపుకొత్తూరు మండలంలోని శివసాగర్‌ బీచ్‌, సంతబొమ్మాళి మండలంలోని భావనపాడు, గార  మండలంలోని కళింగపట్నం, శ్రీకాకుళం మండలం లో కళ్లేపల్లి తీరంలో సందడిగా సందర్శ కులు కుటుంబాలతో గడిపేందుకు సిద్ధమ య్యారు. తీరాన్ని ఆనుకొని ఉన్న ఆలయాలను  సుందరంగా తీర్చిదిద్దారు. తీరంలో సందడి చేసేందుకు వచ్చే పర్యాటకులు బీచ్‌ల్లో లోపలికి వెళ్లకుండా మెరైన్‌ పోలీసులు హెచ్చరికలు చేశారు. వివిధ కులసంఘాల సభ్యులు తోటల్లో ఆత్మీయ కలయిక కోసం ఏర్పాట్లు చేశారు.

Advertisement
Advertisement