Abn logo
Oct 3 2020 @ 13:48PM

ఆముదంతో అందం

ఆంధ్రజ్యోతి(03-10-2020)

క్రీస్తు పూర్వమే ఆముదంతో అందాన్ని పెంచుకునేవారు. ఆముదం సహజంగానే క్లెన్సర్‌లా ఉపయోగపడుతుంది. దీన్ని ముఖానికి పట్టించి పదినిమిషాల పాటూ ఆవిరిపడితే చర్మకణాలు శుభ్రపడతాయి. ముఖంపై పేరుకున్న మురికి పోతుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. మోచేయి, మెడ భాగంలో నలుపుదనం ఉన్నవాళ్లు ఆముదంలో కాస్త ఆలివ్ నూనె, నిమ్మరసం కలిపి రోజూ ఆయా భాగాలలో మర్దనా చేయాలి. ఇలా చేస్తే నెల రోజులకు మంచి ఫలితం కనిపిస్తుంది. పాదాల పగుళ్ల సమస్యకు కూడా ఆముదంతో చెక్ పెట్టచ్చు. ఆముదంలో కాస్త పసుపు కలిపి పగుళ్ల మీద రాయాలి. కొన్నిరోజులకు పగుళ్లు మాయమవుతాయి. పొడి చర్మంతో ఇబ్బందిపడేవారు రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఆముదంతో మర్దనా చేసుకోవాలి. ఉదయం లేచాక గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే సమస్య తీరడమే కాకుండా, చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలు పోతాయి.

Advertisement
Advertisement
Advertisement