ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి

ABN , First Publish Date - 2021-02-24T04:50:12+05:30 IST

బీడీ కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి షర తులు లేకుండా జీవనభృతి చెల్లించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మి క సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధరాములు డిమాండ్‌ చేశారు.

ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి
భిక్కనూరులో ర్యాలీ నిర్వహిస్తున్న బీడీ కార్మికులు

భిక్కనూరు, ఫిబ్రవరి 23:బీడీ కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి షర తులు లేకుండా జీవనభృతి చెల్లించాలని తెలంగాణ బహుజన బీడీ కార్మి క సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధరాములు డిమాండ్‌ చేశారు. మంగళవా రం మండల కేంద్రంలో బీడీ కార్మికులు తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌ కార్యాల యం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధ రాములు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎలాం టి షరతులు విధించకుండా ప్రతీ బీడీ కార్మికురాలికి రూ.2016 జీవన భృతి చెల్లించాలని, నెలకు తప్పకుండా 26 రోజలు పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని హెచ్ఛరించారు. అనంతరం తహసీల్దార్‌ గోవర్ధన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం ప్రతినిధులు సదానందం, శ్రీనివాస్‌, గంగమణి, నబ్బు, సత్యనారాయణ, బాల్‌లింగం, ఆయాగ్రామాల బీడీ కార్మికులు పాల్గొ న్నారు.

Updated Date - 2021-02-24T04:50:12+05:30 IST