ఎల్‌ఐసీ బీమా జ్యోతి పథకం

ABN , First Publish Date - 2021-02-23T05:44:42+05:30 IST

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ).. మార్కెట్లోకి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ బీమా జ్యోతి పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పథకం భవిష్యత్‌కు భద్రతతో పాటు పొదుపున...

ఎల్‌ఐసీ బీమా జ్యోతి పథకం

ముంబై:  ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ).. మార్కెట్లోకి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ బీమా జ్యోతి పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పథకం భవిష్యత్‌కు భద్రతతో పాటు పొదుపున కూ అవకాశం కల్పిస్తుంది. ఇది నాన్‌-లింక్డ్‌, నాన్‌-పార్టిసిపేటింగ్‌, వ్యక్తిగత, పొదుపు పథకం. ఈ పథకం మెచ్యూరిటీపై పాలసీదారుకు గ్యారంటీడ్‌ సొమ్ము లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు అకాల మరణం చెందితే (పాలసీ కాలపరిమితి లోగా), ఆ వ్యక్తి కుటుంబానికి ఆర్థిక మద్దతు కల్పిస్తుంది. పాలసీ కాలపరిమితిలో ప్రతి సంవత్సరాంతానికి సమ్‌ అస్యూర్డ్‌లో ప్రతి 1000 రూపాయలకు కనీసం రూ.50 అదనంగా జమవుతుందని తెలిపింది. కనీస సమ్‌ అస్యూర్డ్‌ రూ.లక్ష. గరిష్ఠ పరిమితి లేదు. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల కాలపరిమితితో పాలసీని తీసుకోవచ్చు. 90 రోజుల వయసు నుంచి 60 ఏళ్ల లోపు వయసు వారు ఈ పాలసీ కొనుగోలుకు అర్హులు. 

Updated Date - 2021-02-23T05:44:42+05:30 IST