Abn logo
Mar 26 2020 @ 06:56AM

బీర్లు లూటీ..

 ప్రభుత్వ గోదాంలో ఆగి ఉన్న లారీ నుంచి...     

హైదరాబాద్/పేట్‌బషీరాబాద్‌(ఆంధ్రజ్యోతి): దేవరయాంజల్‌ గ్రామంలోని మేడ్చల్‌ మద్యం గోదాము వద్ద ఆగి ఉన్న లారీ నుంచి బీర్లను లూటీ చేశారు. కింగ్‌ఫిషర్‌ లోడ్‌తో మల్లేపల్లి నుంచి దేవరయాంజల్‌లోని మద్యం డిపో-1 వద్దకు ఈ నెల 18న ఏపీ 27 డబ్ల్యూ 7758 నంబర్‌ గల లారీ వచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దానిని అన్‌లోడ్‌ చేయలేదు. దీంతో లారీని డిపో వద్దే నిలిపి ఉంచగా, మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రహరీ పక్కన రాళ్లు పెట్టి గోదాములోకి దిగారు. లారీ టార్పాలిన్‌, తాళ్లను కట్‌ చేసి అందులోని 120 కేసుల బీర్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని లారీ డ్రైవర్‌ డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పేట్‌బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు ఇంటి దొంగల పనా, మరెవరైనా వచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement
Advertisement
Advertisement