బీట్‌రూట్‌ టొమాటో సూప్‌...

ABN , First Publish Date - 2020-10-22T06:09:54+05:30 IST

రుచితో పాటు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలకు ఇప్పుడు ఆదరణ ఎక్కువయింది. కూరగాయల సూప్‌తో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు...

బీట్‌రూట్‌ టొమాటో సూప్‌...

రుచితో పాటు ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచే వంటకాలకు ఇప్పుడు ఆదరణ ఎక్కువయింది. కూరగాయల సూప్‌తో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అంటున్నారు. చెఫ్‌ రేణూ దలాల్‌. ఆయన సూచిస్తున్న ఇమ్యూనిటీ రెసిపీ ఇది... 


కావలసినవి:

  1. బీట్‌రూట్‌- ఒకటిన్నర, తోలు తీసి, ఉడికించి ముక్కలుగా కోయాలి.
  2. టొమాటోలు- మూడు, ఉడకబెట్టి ముక్కలుగా కోయాలి.
  3. బంగాళదుంప- ఒకటి, పైతోలు తీసి, ఉడకబెట్టినది.
  4. ఆలివ్‌ నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు
  5. ఒరెగానో- సగం టేబుల్‌స్పూన్‌
  6. తరగిన ఉల్లిపాయ ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్లు
  7. ఉప్పు, మిరియాలు- రుచికి సరిపడా. 
  8. కాల్చిన బ్రెడ్‌ ముక్కలు- అలంకరణ కోసం.


తయారీ

  1. ముందుగా బీట్‌రూట్‌, బంగాళదుంప, టొమాటోలను మిక్సీలో వేసి మెత్తని గుజ్జు తయారుచేసుకోవాలి.
  2. ఇప్పుడు కడాయిలో ఆలివ్‌ ఆయిల్‌ వేడిచేసి, ఉల్లిపాయ ముక్కలు, ఒరెగానో వేసి కలపాలి. నిమిషం పాటు వేగనివ్వాలి. 
  3. తరువాత వెజిటబుల్‌ ప్యూరీ వేయాలి. కప్పు నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి మూడు నిమిషాలు ఉడికించాలి. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన బీట్‌రూట్‌ టొమాటో సూప్‌ రెడీ.
  4. కాల్చిన బ్రెడ్‌ ముక్కలతో అలంకరించి వేడివేడిగా సర్వ్‌ చేయాలి.

Updated Date - 2020-10-22T06:09:54+05:30 IST