Abn logo

బీట్‌రూట్ పెరుగు చట్నీ

కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తరుగు - 2 కప్పులు, పెరుగు - ఒకటిన్నర కప్పులు, ఉల్లితరుగు - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 4 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - 4 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 1, కరివేపాకు - 8 రెబ్బలు, పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు, అల్లం - పావు అంగుళం ముక్క, ఎండుమిర్చి - 2.


తయారుచేసే విధానం: మిక్సీలో పచ్చికొబ్బరి, 2 టీ స్పూన్ల ఆవాలు, అల్లం ముక్క వేసి పేస్టు చేసి పక్కనుంచాలి. కడాయిలో 2 టీ స్పూన్లు నూనె వేసి మిగిలిన ఆవాలు వేగించి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, 4 కరివేపాకు రెబ్బలు వేయాలి. అన్నీ వేగాక బీట్‌రూట్‌ తురుము వేసి వేగించాలి. ఇప్పుడు పచ్చికొబ్బరి మిశ్రమం వేసి బాగా కలపాలి. తర్వాత గిలకొట్టిన పెరుగులో బీట్‌రూట్‌ మిశ్రమం కలిపి పైనుండి ఎండుమిర్చి, కరివేపాకుతో పెట్టిన తాలింపు వేయాలి.

ఖట్టా మీఠా చట్నీనీటి ఆవకాయ పచ్చడిమామిడి తరుము పచ్చడిఅరటికాయ పెరుగు పచ్చడిముల్లంగి తొక్కునువ్వుల చట్నీక్యాప్సికమ్‌ పెరుగు పచ్చడితీపి కాకర పచ్చడిబొంబాయి చట్నీఉసిరి చట్నీ
Advertisement