బడ్జెట్‌కు ముందు... ఆ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే... లాభాలు...

ABN , First Publish Date - 2021-01-27T22:07:51+05:30 IST

బడ్జెట్‌ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపధ్యంలో... ఏ స్టాక్స్‌ కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయనేది ఆర్థికరంగ నిపుణులు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేప ధ్యంలో స్టాక్స్‌్‌పై మంచి రిటర్న్స్‌ రాబట్టుకునేందుకుగాను మార్కెట్‌ నిపుణులు సలహాలిస్తున్నారు.

బడ్జెట్‌కు ముందు... ఆ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌చేస్తే... లాభాలు...

 ముంబై : బడ్జెట్‌ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానున్న నేపధ్యంలో... ఏ స్టాక్స్‌ కొనుగోలు చేస్తే మంచి లాభాలు వస్తాయనేది ఆర్థికరంగ నిపుణులు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. కేంద్రం బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న నేప ధ్యంలో స్టాక్స్‌్‌పై మంచి రిటర్న్స్‌ రాబట్టుకునేందుకుగాను మార్కెట్‌ నిపుణులు సలహాలిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. 


ప్రత్యేకించి... రాష్ట్రీయ కెమికల్స్‌ మరియు ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటరని సూచిస్తుండడం గమనార్హం. బడ్జెట్‌కంటే ముందు ప్రభుత్వరంగ ఫెర్టిలైజర్స్‌ సంస్థలో స్టాక్స్‌ కొనుగోలు చేస్తే మంచి లాభాలను ఆశించొచ్చని నిపుణులు చెబుతున్నారు.


గ్రామీణ భారతంలో రాష్ట్రీయ కెమికల్స్‌ మరియు ఫెర్టిలైజర్స్‌కు మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ బడ్జెట్‌లో సబ్సిడీ సంస్థ అయిన ఆర్‌ఎఫ్‌సికి బకాయిలు చెల్లించే ప్రకటన రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసు కోవడం, నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేయడం తదితర సానుకూల పరిణామాలు ఆర్‌ఎఫ్‌సీకి మేలు చేకూరుస్తా యని, ఈ క్రమంలోనే... ఈ స్టాక్స్‌ పుంజుకుని లాభాలు తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతున్నారు.


ఇక స్వల్పకాలిక లక్ష్యా లకు ఆర్‌ఎఫ్‌సి స్టాక్స్‌ లో ఇన్వెస్ట్‌చేయడం మంచిదని చెప్పారు. ఇక... ఉక్కు రంగం నుంచి జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేయడం బెటరని చెబుతున్నారు. ఈ త్రైమాసికంలో ఉక్కు రంగంలో పలు సంస్థలు లాభాల దిశగా పయనించాయని ఉదహరించారు. 

Updated Date - 2021-01-27T22:07:51+05:30 IST