మృతకణాలను తొలగించే ముందు...

ABN , First Publish Date - 2020-09-09T05:30:00+05:30 IST

జిడ్డుచర్మం అయితే జెల్‌ స్క్రబ్‌ వాడాలి. పొడిచర్మం ఉన్నవారు క్రీమ్‌ స్క్రబ్‌ ఉపయోగించాలి.

మృతకణాలను తొలగించే ముందు...

జిడ్డుచర్మం అయితే జెల్‌ స్క్రబ్‌ వాడాలి. పొడిచర్మం ఉన్నవారు క్రీమ్‌ స్క్రబ్‌ ఉపయోగించాలి. సున్నితమైన చర్మం ఉన్నవారికి తేలికైన , చిన్నచిన్న బీడ్స్‌ లేని స్క్రబ్బర్‌ చక్కగా సరిపోతుంది. 

స్క్రబ్బింగ్‌ ఎక్కువగా రాత్రి పూట చేయాలి. ఎందుకంటే రాత్రి సమయంలో చర్మంలోని కణాలు వాటంతట అవే మరమ్మతు అవుతాయి. అందుచేత రాత్రిపూట నిద్రపోయే ముందు ముఖానికి స్క్రబ్‌ చేసుకొని, మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.

 ముఖానికి  నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. మృతకణాలను తొలగించే ముందు ముఖం కడుక్కొని, చేతివేళ్లతో వలయాకారంలో తిప్పాలి. తరువాత స్క్రబ్బింగ్‌ చేసుకోవాలి. 

Updated Date - 2020-09-09T05:30:00+05:30 IST