Advertisement
Advertisement
Abn logo
Advertisement

యాచకుల మధ్య గొడవ.. ఒకరు మృతి

హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు యాచకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక యాచకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పబ్లిక్ నల్ల వద్ద స్నానం చేయకూడదని అన్న కారణంగా పురుషోత్తం అనే వ్యక్తిని బహదూర్ అనే వ్యక్తి రోకలిబండతో కొట్టి  చంపాడు. ఈ గొడవ మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. దీంతో నిందితుల్ని అరెస్టు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement