అమ్మా.. ఆకలి!
ABN , First Publish Date - 2020-04-06T09:13:11+05:30 IST
ఈ చిత్రం చూశారా.. ప్రస్తుత లాక్డౌన్లో పేదల ఆకలి ఆకలి కేకలకు దర్పణం... రహదారులే ఆవాసంగా బతికే యాచకుల దుస్థితికి నిదర్శనం. కరోనా పుణ్యమాని.. ఆకలితో అలమటిస్తూ ముళ్లతో ఉన్న
- కృష్ణా జిల్లాలో హృదయాలను కదలించిన దృశ్యం
ఈ చిత్రం చూశారా.. ప్రస్తుత లాక్డౌన్లో పేదల ఆకలి ఆకలి కేకలకు దర్పణం... రహదారులే ఆవాసంగా బతికే యాచకుల దుస్థితికి నిదర్శనం. కరోనా పుణ్యమాని.. ఆకలితో అలమటిస్తూ ముళ్లతో ఉన్న పామాయిల్ గెలను ఓ యాచకురాలు తింటుండగా కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఫైఓవర్పై ‘ఆంధ్రజ్యోతి’ కెమెరా కంటపడింది. లాక్డౌన్ అమలులో ఉన్న కారణంగా ఎవరి ఇళ్లకు వారు పరిమితమైపోయారు. దుకాణాలు, ఆఫీసులు అన్నీ బందైపోయాయి. వ్యాపార లావేదేవీలు నిలిచిపోయాయి. ఇళ్ల యజమానులు.. యాచకులను సైతం దరిదాపులకు రానీయడంలేదు. దీంతో యాచక వృత్తిలో ఉండే ఇలాంటి వారి పరిస్థితి దయనీయంగా మారింది. దొరికింది తింటూ.. బోరు నీళ్లు తాగుతూ .. ఇలా కాలం వెలిబుచ్చుతున్నారు.