క‌రోనా యోధునిగా యాచ‌కుడు... ఏంచేస్తున్నాడంటే...

ABN , First Publish Date - 2020-05-19T13:37:41+05:30 IST

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక బిచ్చగాడు కరోనా యోధునిగా మారాడు. యాచనచేస్తూ జీవిస్తున్న దివ్యాంగుడైన‌ రాజు క‌రోనా క‌ష్ట‌కాలంలో అంద‌రికీ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాడు. రాజు ఇప్పటివరకు...

క‌రోనా యోధునిగా యాచ‌కుడు... ఏంచేస్తున్నాడంటే...

ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఒక బిచ్చగాడు కరోనా యోధునిగా మారాడు. యాచనచేస్తూ జీవిస్తున్న దివ్యాంగుడైన‌ రాజు క‌రోనా క‌ష్ట‌కాలంలో అంద‌రికీ ఉదాహ‌ర‌ణ‌గా నిలిచాడు. రాజు ఇప్పటివరకు 100 పేద కుటుంబాలకు ఒక నెల రేషన్‌తో పాటు, మూడువేల‌ మాస్కులు పంపిణీ చేశాడు. రాజు ట్రైసైకిల్‌పై రోజంతా తిరుగుతూ యాచిస్తుంటాడు. ఈ విధంగా వ‌చ్చిన‌ డబ్బుతో పేద‌ల‌కు రేష‌న్ అందించాడు. గ‌తంలో రాజు తన యాచన డబ్బుతో 22 మంది పేద యువ‌తుల‌కు వివాహాలు జ‌రిపించాడు. అలాగే పఠాన్‌కోట్‌లో ఒక వంతెనకు మ‌ర‌మ్మ‌తులు చేయించాడు. ఇంతేకాకుండా రాజు పేద పిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లిస్తుంటాడు. వేసవిలో చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేస్తాడు. ఈ విధంగా ఈ యాచ‌కుడు త‌న‌లోని మాన‌వ‌త్వాన్ని వెలికితీస్తూ, అంద‌రికీ స్ఫూర్తినిస్తున్నాడు. 

Updated Date - 2020-05-19T13:37:41+05:30 IST