యాచకులతో జాగ్రత్త... లైట్ తీసుకున్నారో...

ABN , First Publish Date - 2020-10-12T16:30:19+05:30 IST

కరోనా తగ్గలేదు.. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమని వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. కానీ, గ్రేటర్‌లోని ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద పరిస్థితి రోజురోజుకూ ప్రమాదకరంగా

యాచకులతో జాగ్రత్త... లైట్ తీసుకున్నారో...

హైదరాబాద్‌ : కరోనా తగ్గలేదు.. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమని వైద్య నిపుణుల హెచ్చరిస్తున్నారు. కానీ, గ్రేటర్‌లోని ప్రధాన రహదారులు, చౌరస్తాల వద్ద పరిస్థితి రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా యాచకులు రోడ్లపైకి వస్తున్నారు. మాస్క్‌లు, భౌతిక దూరం పాటించాలన్న కనీస జాగ్రత్తలు వారు పాటించకపోవడం వైరస్‌ వ్యా ప్తికి దారి తీసే అవకాశం ఉంది. బెగ్గింగ్‌ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను మారుస్తామని గతంలో ప్రకటించిన జీహెచ్‌ఎంసీ, జైళ్ల శాఖలు స్పెషల్‌ డ్రైవ్‌ను మూన్నాళ్ల ముచ్చట చేశాయి. ట్రాఫిక్‌ పోలీసులతో కలిసి పలు ప్రాంతాల్లోని యాచకులను శివార్లలోని షెల్టర్‌ హోంలకు, చిన్నారుల ను చైల్డ్‌ లైన్‌ సెంటర్లకు పంపించారు. శారీరకంగా బాగున్న వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. అన్ని కార్యక్రమాల్లానే బెగ్గింగ్‌ ఫ్రీ సిటీ డ్రైవ్‌నూ జీహెచ్‌ఎంసీ గాలికొదిలేసింది. దీంతో యాచకు లు ఎప్పటిలానే రోడ్లపై కనిపిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఏమో కానీ.. కొవిడ్‌-19 ప్రభావం ఉన్న ప్రస్తుత సమయంలో చాలా మంది యా చకులు చిన్నపిల్లలను ఎత్తుకొని భిక్షాటన చేస్తున్నారు. ఇది చిన్న పిల్లల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. మెజార్టీ యాచకులు, వారి వెంట ఉంటే చిన్నారులకు మాస్క్‌లు లేకపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలే యా చిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో యాచకులను శిబిరాలకు తరలించిన వసతి, భోజన సదుపాయం కల్పించిన ప్రభుత్వ విభాగాలు ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదు.


వాహనదారులకూ ముప్పు... 

యాచకులకే కాదు.. వారి వల్ల వాహనదారులకూ ముప్పు పొంచి ఉంది. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు భిక్షాటన చేస్తూ వం దల మందిని కలుస్తుంటారు. దీంతో వారి నుం చి వాహనదారులు, వాహనదారుల నుంచి వారికి వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కొవిడ్‌పై అవగాహన లేకనో, ఆకలి బాధతోనే, వాహనదారుల దగ్గరి వరకు వెళ్తున్నారు. దీంతో వాహనదారులు భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాచకులకు భోజన వసతి కల్పించి, వారు రోడ్లపైకి రాకుండా ప్రభు త్వ విభాగాలు చర్యలు తీసుకోవాలని పౌరులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-12T16:30:19+05:30 IST