ప్రత్యక్ష బోధన ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-25T05:19:39+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది.

ప్రత్యక్ష బోధన ప్రారంభం
పాఠశాలకు హాజరైన విద్యార్థులు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, పిబ్రవరి 24: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 6,7,8 తరగతుల విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. జిల్లాలోని 33 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో 2,817 మంది విద్యార్థులకు 188 మంది, 7వ తరగతిలో 2,963 మంది విద్యార్థులకు 153 మంది, 8వ తరగతిలో 2,785 మందికి 164 మంది విద్యార్థులు హాజరయ్యారు. 7 మోడల్‌ స్కూళ్లలో 6వ తరగతిలో 350మంది, 7వ తరగతిలో 553 మంది, 8వ తరగతిలో 571 మందితోపాటు 13 కేజీబీవీలలో 6వ తరగతిలో 271 మంది, 7వ తరగతిలో 403 మంది, 8వ తరగతిలో 377 మంది విద్యార్థులకు ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. ట్రైబల్‌వెల్ఫేర్‌పాఠశాలలో 6వ తరగతగిలో 76 మంది, 7వ తరగతిలో 84 మంది, 8వ తరగతిలో 76 మంది విద్యార్థులకు  ఒక్క విద్యార్థి కూడా హాజరుకాలేదు. 65 ప్రైవేట్‌ పాఠశాలల్లో 6వ తరగతిలో 1,944 మందికి 22 మంది, 7వ తరగతిలో 1547 మందికి 28 మంది, 8వ తరగతిలో 1,442 మందికి 26 మంది విద్యార్థులు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించారు.   జిల్లా కేంద్రంలోని పాఠశాలలకు హాజరైన విద్యార్థులు అనుమతి పత్రాలు తీసుకురాకపోవడంతో మధ్యాహ్న భోజనం తర్వాత ఇంటికి పంపించారు. గురువారం పాఠశాలకు వచ్చేముందు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాలు తీసుకురావాలని  ప్రధానోపాధ్యాయులు సూచించారు. 

Updated Date - 2021-02-25T05:19:39+05:30 IST