కొండముచ్చుల కోసం వేట ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-24T06:50:16+05:30 IST

నేరేడుచర్లలో కొండముచ్చులను పట్టుకునేందుకు నిపుణుల సాయంతో బోన్లు ఏర్పాటు చేశారు.

కొండముచ్చుల కోసం వేట ప్రారంభం
నేరేడుచర్లలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు

బోన్లు ఏర్పాటు చేసిన మునిసిపల్‌ అధికారులు

నేరేడుచర్ల, అక్టోబరు 23: నేరేడుచర్లలో కొండముచ్చులను పట్టుకునేందుకు నిపుణుల సాయంతో బోన్లు ఏర్పాటు చేశారు. నేరేడుచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో 7 గురు విద్యార్థులపై కొండముచ్చు దాడి చేసి గాయపర్చింది. దీంతో మున్సిపల్‌ అధికారులు ప్రకాశం జిల్లా నెల్లూరుకు చెందిన 6గురు నిపుణులను రప్పించి కొండముచ్చులు నివాసం ఏర్పాటు చేసుకున్న స్థలంలో వాటికోసం ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లలో కొండముచ్చులకు కావాల్సిన ఆహార పదార్ధాలను ఉంచి అవి లోపలికి వెళ్లగానే వాటిని బంధించే విధంగా ప్రణాళిక సిద్దం చేశారు. రెండు మూడు రోజుల్లో కొండముచ్చులను పట్టుకోనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ చందమళ్ల జయబాబు గోపయ్యలు తెలిపారు.



Updated Date - 2021-10-24T06:50:16+05:30 IST