Abn logo
Jun 4 2020 @ 12:32PM

రూ. 300 సాయం కోరిన న‌టునికి రూ. 10 వేలు సాయం చేసిన న‌టి!

లాక్‌డౌన్‌లో షూటింగులు ఆగిపోవ‌డంతో ఆర్థిక ఇబ్బందుల‌లో చిక్కుకున్నాన‌ని, ఎవ‌రైనా సాయం చేయాల‌ని హిందీ టీవీ సీరియల్ బెగుసరై న‌టుడు ఒక వీడియోలో అంద‌రినీ అభ్య‌ర్థించారు. హిందీ టీవీ సీరియల్ బెగుసరైలో శివంగి జోషి తండ్రిగా నటించిన నటుడు రాజేష్ ధార్స్  త‌న గోడును వివ‌రిస్తూ, ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేశారు. రూ. 300 లేదా 400  త‌న‌కు విరాళంగా ఇవ్వాలని, దీంతో త‌న‌కు పంజాబ్ వెళితే  ఏదో ఒక పని దొరుకుతుందని ఆయన అభ్య‌ర్థించారు. ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఈ నేప‌ధ్యంలో బెగుస‌రై సీరియ‌ల్ న‌టి శివంగి జోషి అత‌నికి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. రాజేష్‌కు ఆమె రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. కాగా బెగుస‌రై సీరియ‌ల్‌లో న‌టి శివంగి జోషికి రాజేష్ ధార్స్ తండ్రి పాత్ర‌లో న‌టించారు. కాగా శివంగి సహాయం చేయడంపై రాజేష్ ఆనందం వ్య‌క్తం చేశారు. తాము ఒక‌రికొకరు ద‌గ్గ‌ర‌గా లేన‌ప్ప‌టికీ ఆమె సాయం చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.


Advertisement
Advertisement
Advertisement