Abn logo
Sep 28 2021 @ 00:41AM

రోడ్డు ప్రమాదంలో బేల్దారి మృతి

తనకల్లు, సెప్టెంబరు 27 :  మండల కేంద్రమైన తన కల్లు సమీపంలో బొరుగులు ఫ్యాక్టరీ వద్ద సోమవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో నల్లచెరువు మండ లం దామావా ండ్లపల్లికి చెందిన ఓబులేసు (39) అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్థులు తె లిపిన వివరాల మేరకు.. ఓబులే సు  నల్లచెరువులో కాపురం ఉండి బేల్దారి పనులు చేసుకుం టూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం తన భార్య అక్క గోపా లమ్మను చిత్తూరు జిల్లాలోని కాండ్లమడుగు వద్ద ఉన్న పెద్దపల్లి గ్రామానికి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్తుండగా తన కల్లు వద్ద అదుపు తప్పి కిందపడ్డారు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న బండరాళ్ళపై పడటంతో ఓబులేసు అక్కడికక్కడే మృతి చెందాడు. గోపాలమ్మకు స్వల్పగాయాలయ్యాయి. ఆమెను  తనకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న బం ధువులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తనకల్లు పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.