కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం!

ABN , First Publish Date - 2020-10-17T21:08:24+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్ది

కరోనా ఎఫెక్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న బెల్జియం!

బ్రస్సెల్స్: కరోనా వైరస్ నేపథ్యంలో బెల్జియం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూని విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో  కొద్దిరోజులుగా బెల్జియంలో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గతవారం  సగటున రోజుకు 6వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. దీంతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై బెల్జియం ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం కోసం దేశ వ్యాప్తంగా నెలరోజులపాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ ఆదేశాలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. 


అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేయనున్నట్లు వివరించింది. కర్ఫ్యూ సమయంలో కేఫ్‌లు, రెస్టారెంట్‌లు మూసేయాలని ఆదేశాల్లో పేర్కొంది. రాత్రి 8 గంటల తర్వాత మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. వీలైతే ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం తీసుకోవాలని సూచించింది. కొవిడ్ కేసులు పెరగడంపట్ల ఆ దేశ ప్రధాని అలగ్జాండర్ డి క్రూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై, వైద్యులపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందన్నారు. అంతేకాకుండా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 35 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు కోటీ 15 లక్షల జనాభా ఉన్న బెల్జియంలో ఇప్పటి వరకు సుమారు 2లక్షల మంది కరోనా బారినపడ్డారు. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10వేలు దాటింది. 


Updated Date - 2020-10-17T21:08:24+05:30 IST