నమ్మకానికి గుర్తింపు

ABN , First Publish Date - 2021-06-24T05:21:11+05:30 IST

కనిగిరి నియోజక వర్గంలోని వెలిగండ్ల మండలంలో ఓ మారుమూల పల్లె మొగళ్లూరు గ్రామం. పుట్టింది దళిత కుటుంబంలో అయినా, విద్యావంతుడిగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఎంతో మృధు స్వభావిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి గూడూరి ఎరిక్షన్‌బాబు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1994 లో టీడీపీలోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే ఉంటూ అభివృద్ధికి విశేషకృషి చేశారు.

నమ్మకానికి గుర్తింపు
టీడీపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో వై పాలెం టీడీపి ఇన్‌చార్జి గూడూరి

  యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జిగా ఎరిక్షన్‌బాబు

 సముచితస్థానం కల్పించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

కనిగిరి, జూన్‌ 23: కనిగిరి నియోజక వర్గంలోని వెలిగండ్ల మండలంలో ఓ మారుమూల పల్లె మొగళ్లూరు గ్రామం. పుట్టింది దళిత కుటుంబంలో అయినా, విద్యావంతుడిగా అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఎంతో మృధు స్వభావిగా, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందిన వ్యక్తి  గూడూరి ఎరిక్షన్‌బాబు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న ఆయన 1994 లో టీడీపీలోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే  ఉంటూ అభివృద్ధికి విశేషకృషి చేశారు.   1995వ సంవత్సరంలో టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. 2001లో వెలిగండ్ల జడ్పీటీసీగా గెలుపొంది పార్టీ ప్రతిష్టను మరింత పెంచారు. హోదా కాదు పార్టీ గెలుపే ముఖ్యంగా భావించి 2005లో వెలిగండ్ల మండలంలోని మొగళ్ళూరు గ్రామం నుంచి సర్పంచ్‌గా గెలిచి చూపించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ, అధిష్ఠానంతో ఎంతో ఒదిగి ఉంటూ తనకు ఇచ్చిన భాధ్యతను ఎంతో ఇష్టంగా భావించి నెరవేర్చే నమ్మకమైన వ్యక్తిగా  గుర్తింపు పొందాడు. పార్టీ అధిష్టానం నెల్లూరు. తిరుపతి, తదితర ప్రాంతాలకు పరిశీలకుడిగా బాధ్యతలు అప్పజెప్పినపుడు ఆయా ప్రాంతాల్లో టీడీపీ కార్యక్రమాలను నిర్వహించి పార్టీ నాయకుల మధ్య అంతరాలను తొలగించి సమైక్య దిశగా నడిపించేందుకు ఆయన చేసిన కృషి వృథా కాలేదు. ఆ కృషిని గుర్తించి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎరిక్షన్‌ బాబును  యర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జిగా నియమించి మరోసారి రుజువు చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గానికి కనిగిరి నియోజకవర్గ వాసి ఎంపిక కావటం కనిగిరి నియోజకవర్గ దళితుల్లో, టీడీపీ శ్రేణుల్లో, ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ చంద్రబాబు మాట, నిర్ణయమే నాకు శిరోధార్యం. పదవి హోదా నాకు ముఖ్యం కాదు చంద్రబాబు ఏది చేయమంటే అదే చేస్తాను. ఆయన అండదండలతోనే పార్టీలో ఎదిగాను.  చంద్రబాబు ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులను కలుపుకుని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. 

Updated Date - 2021-06-24T05:21:11+05:30 IST