Abn logo
May 20 2020 @ 09:34AM

సుధీర్‌తో బెల్లంకొండ శ్రీనివాస్?

`రాక్షసుడు` సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం చకచకా సినిమాలు అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అల్లుడు అదుర్స్` సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విడుదల కాకముందే మరో సినిమాకు బెల్లంకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 


`స్వామిరారా`, `రణరంగం` వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు బెల్లంకొండ ఓకే చెప్పాడట. సుధీర్ వర్మ స్టైల్లో‌ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతోందట. లాక్‌డౌన్ తర్వాత ఈ సినిమా గురించి ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement