Abn logo
Sep 21 2020 @ 11:37AM

షూటింగ్‌ షురూ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్‌

Kaakateeya

'రాక్షసుడు' వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. 'కందిరీగ' ఫేమ్‌ సంతోశ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కోవిడ్‌ ఎఫెక్ట్‌తో ఆగిన ఈ సినిమా షూటింగ్‌ సోమవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. వీలైనంత త్వరగా ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రీకరణను పూర్తి చేస్తారు. సినిమాను 2021 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. సోనూసూద్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. నభానటేశ్‌, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌సార్ట్‌ దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. 



Advertisement
Advertisement
Advertisement