Ben stokes: రిటైర్డ్ కాలేదు కానీ..

ABN , First Publish Date - 2021-07-31T07:32:42+05:30 IST

ఇంగ్లీష్ క్రికెటర్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆట నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఎప్పటివరకు ఈ విరామం అనేది..

Ben stokes: రిటైర్డ్ కాలేదు కానీ..

లండన్:ఇంగ్లీష్ క్రికెటర్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆట నుంచి కొంత విరామం తీసుకున్నాడు. ఎప్పటివరకు ఈ విరామం అనేది చెప్పకుండానే క్రికెట్‌ నుంచి కొంతకాలం తప్పుకుంటున్నానంటూ స్టోక్స్ ప్రకటించడంతో ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. జట్టుకు ప్రంపంచకప్ అందించిన హీరో, ఇంగ్లీష్ బెస్ట్ ఆల్‌రౌండర్ ఇలా అర్థాంతరంగా ఆట నుంచి విరామం తీసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. 


అయితే అతడి ఎడమచేతి చూపుడు వేలు గాయం మానడంతో పాటు మానసికంగా విశ్రాంతి తీసుకునేందుకే స్టోక్స్ ఈ విరామం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) వెల్లడించింది. స్టోక్స్ విరామంతో మరో వారంలో భారత్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ నుంచి అతడిని ఈసీబీ తప్పించింది. భారత్‌తో టెస్ట్‌లకు స్టోక్స్ స్థానంలో సోమర్‌సెట్ క్రెయిగ్ ఓవర్‌టన్ ఆడనునున్నాడు. కాగా.. ఎప్పటివరకు స్టోక్స్ విశ్రాంతి తీసుకుంటాడు..? మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడు అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు.

Updated Date - 2021-07-31T07:32:42+05:30 IST