భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ABN , First Publish Date - 2021-01-27T21:40:01+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో, మెటల్, ఫార్మా స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తడంతో

భారీ నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు..

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ వరుసగా నాలుగో రోజు భారీ నష్టాలతో ముగిశాయి. బ్యాంక్, ఆటో, మెటల్, ఫార్మా స్టాక్స్‌లో అమ్మకాలు పోటెత్తడంతో సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ సైతం దాదాపు 2 శాతం మేర క్షీణించింది. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుండడంతో పాటు నెలవారీ డెరివేటివ్స్ గడువు గురువారం ముగుస్తుండడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పోటీపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 937.66 పాయింట్లు (1.94 శాతం) నష్టపోయి 47,409.93 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 271.40 పాయింట్లు (1.91 శాతం) నష్టపోయి 13,967.50 వద్ద క్లోజ్ అయ్యింది. నిఫ్టీలో టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంకు, టాటా స్టీల్, గెయిల్, టైటాన్ కంపెనీ తదితర షేర్లు అత్యధిక నష్టాలను ఎదుర్కోగా.. టెక్ మహింద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, విప్రో, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ముందంజలో ఉన్నాయి.  

Updated Date - 2021-01-27T21:40:01+05:30 IST