వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-07-31T22:14:57+05:30 IST

భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు ..

వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడోరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు మందకొడిగా సాగడంతో పాటు ఫైనాన్షియల్ సర్వీసులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో దేశీయ మార్కెట్లపై ప్రభావం పడినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 129.18 పాయింట్లు క్షీణించి (0.34 శాతం) 37,606.89 వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 28.70 పాయింట్లు (0.26 శాతం) పతనమై 11,073.45 వద్ద క్లోజ్ అయ్యింది.  నిఫ్టీలో ఐషర్ మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో తదితర షేర్లు అత్యధికంగా నష్టపోగా.. సిప్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, యూపీఎల్ షేర్లు ముందంజలో ఉన్నాయి.

Updated Date - 2020-07-31T22:14:57+05:30 IST