Abn logo

బెండీ ఫ్రై

కావలసిన పదార్థాలు: బెండకాయలు- అర కిలో, సెనగ పిండి- సగం కప్పు, పసుపు: సగం స్పూను, కారం పొడి, గరం మసాలా పొడి, చాట్‌ మసాలా, కొత్తిమీర పొడి- స్పూను, ఉప్పు, నూనె- తగినంత


తయారుచేసే విధానం: బెండకాయల్ని రెండు, మూడుసార్లు కడిగి తుడిచిపెట్టుకోవాలి. ఒక్కో బెండకాయను నిలువుగా కోయాలి. మసాలా పొడులు, సెనగపిండి, ఉప్పు, కారం అన్నిటినీ ఓ గిన్నెలో కలుపుకోవాలి. ఈ పిండిని కోసిన ఒక్కో బెండకాయలో దట్టించాలి. కడాయిలో నూనె వేసి వీటిని వేయిస్తే కుర్‌కురి బేండీ ఫ్రై సిద్ధం. వేపుడులా వద్దు అనుకునే వారు మసాలా దట్టించిన బెండకాయల్ని ఓవెన్‌లో బేక్‌ చేసుకోవచ్చు. ఇవి కూడా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.

సాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌ మునగకాయ థోరన్‌cauliflower కర్రీపనీర్‌ కోఫ్తే కా సలాన్‌
Advertisement