కుటీర పరిశ్రమలతో కుటుంబాలకు మేలు

ABN , First Publish Date - 2021-01-18T05:19:23+05:30 IST

కుటీర పరిశ్రమల వల్ల చిన్న చిన్న కుటుం బాలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి అన్నారు.

కుటీర పరిశ్రమలతో కుటుంబాలకు మేలు

వల్లూరు, జనవరి 17 : కుటీర పరిశ్రమల వల్ల చిన్న చిన్న కుటుం బాలకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి అన్నారు. వల్లూరు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పెంపక కేం ద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహ కులు కుటీర పరిశ్రమ వల్ల పుట్టగొడుగులను తీసుకోవాల్సిన జాగ్రత్త లు, అయ్యే ఖర్చును, మార్కెటింగ్‌ ఎలా చేస్తారన్న విషయాలు తెల్సుకు న్నారు. వారి ద్వారా ఆ విషయాలు తెలుసుకుని ఆనంద పడ్డారు. కేవలం కుటుంబ సభ్యులతోనే ఇలాంటి  పరిశ్రమలు ఏర్పాటుతో ఆ కుటుంబం లాభపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుటీ ర పరిశ్రమలను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసు కుంటామన్నారు. ఇటువంటి వాటిని ఇంకా పరిశీలించి విష యాలు తెలుసుకుని కుటీర పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తామన్నారు. వీరి వెంట గ్రామస్థులు, నిర్వా హకులు ఉన్నారు.


Updated Date - 2021-01-18T05:19:23+05:30 IST