లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-03-01T05:35:10+05:30 IST

దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు వారి ప్రాంతానికి తగిన యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు

లబ్ధిదారులకు అవగాహన కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీహర్ష

- అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

గద్వాల క్రైం, ఫిబ్రవరి 28 : దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు వారి ప్రాంతానికి తగిన యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష సెక్టార్‌ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం అమలుకు జిల్లాలో ఐదు సెక్టార్లను ఏర్పాటు చేసి అధికారులను నియమించినట్లు తెలిపారు. రవా ణా, పరిశ్రమలు, డైరీ, వ్యవసాయం, వాణిజ్య కార్యకలాపాల యూనిట్లపై సంబంధిత అధికారులకు అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలంపూర్‌, గద్వాల నియోజకవర్గాలలో సెక్టార్‌ అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. కుటుంబ సభ్యుల పేర్లు, భూమి వివరాలు, వారి చదువు, పిల్లల చదువుల సమాచారం తీసుకోవా లన్నారు. పిల్లలు చదువు పూర్తి అయితే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చెప్పారు. ఈ వివరాల ఆధారంగా లబ్ధిదారులకు ఏ యూనిట్‌ ప్రయోజనకరమో గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్‌ ఈడీ రమేష్‌బాబు, డీఆర్‌ డీఏ ఉమాదేవి, మార్కెటింగ్‌ అధికారి పుష్ప, జిల్లా పశుసంవర్ధక అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యానవన శాఖ అధికారి సురేష్‌, వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్‌, పరిశ్రమల శాఖ అధికారి యాదగిరి, రవాణాశాఖ అధికారి చక్రవర్తిగౌడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-01T05:35:10+05:30 IST