ఈబీసీ నేస్తంతో 34,179 మంది అగ్రవర్ణ మహిళలకు లబ్ధి

ABN , First Publish Date - 2022-01-26T06:08:20+05:30 IST

జిల్లాలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా తొలివిడతలో 34,179 మంది అగ్రవర్ణ మహిళా లబ్ధిదారులకు రూ. 51. 27 కోట్లు ఆర్థికసాయం మంజూరు చేసినట్లు జేసీ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు.

ఈబీసీ నేస్తంతో 34,179 మంది అగ్రవర్ణ మహిళలకు లబ్ధి
లబ్ధిదారులకు రూ. 51.27 కోట్ల మెగా చెక్కును అందిస్తున్న మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, జాయింట్‌ కలెక్టర్లు


తొలి విడతలో రూ. 51.27 కోట్ల ఆర్థికసాయం

జేసీ నిశాంతకుమార్‌


అనంతపురం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం ద్వారా తొలివిడతలో 34,179 మంది అగ్రవర్ణ మహిళా లబ్ధిదారులకు రూ. 51. 27 కోట్లు ఆర్థికసాయం మంజూరు చేసినట్లు జేసీ నిశాంతకుమార్‌ పేర్కొన్నారు.  మంగళవారం రాష్ట్ర ముఖ్యమం త్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్సకు మంత్రి శంకరనారాయణ, శాసనమండలి విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, జేసీ నిశాంతకుమార్‌, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు సిద్దారెడ్డి, తిప్పే స్వామి తదితరులు హాజరయ్యారు. సీఎం వీడియో కాన్ఫరెన్స అనంతరం జేసీ మాట్లాడుతూ... జిల్లాలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ప థకం ద్వారా మొదటివిడతగా 34,179 మందికి రూ. 51.27 కోట్లు ఆర్థికసాయం మంజూరు చేశామన్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏడాదికి రూ. 15 వేలు చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుందన్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా అనంతపురం అర్బన నియోజకవర్గంలో 1800 మంది, ధర్మవరంలో 3300, గుంతకల్లులో 1580, హిందూ పురంలో 2448, కదిరిలో 3122, కళ్యాణదుర్గంలో 1001, మడకశిరలో 668, పెనుకొండలో 2336, పుట్టపర్తిలో 3063, రాప్తాడులో 3440, రాయదుర్గంలో 1396, శింగనమలలో 4572, తాడిపత్రిలో 4208, ఉరవకొండ నియోజకవర్గంలో 1242 మంది మహిళలు లబ్ధి పొందుతారన్నారు. అనంతరం ఈబీసీ మహిళా లబ్ధిదారులకు రూ. 51.27 కోట్ల మెగా చెక్కును మంత్రి, ఇతర ప్రజాప్రతినిధు లు, జాయింట్‌ కలెక్టర్లు అందజేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొ రేషన చైర్మన మీసాల రంగన్న, వక్కలిగ కార్పొరేషన చైర్‌పర్సన నళిని, నాటక అకాడమీ చైర్‌పర్సన హరిత, జేసీ గంగాధర్‌ గౌడ్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ కొగటం విజయభాస్కర్‌ రెడ్డి, బీసీ కార్పొరేషన ఈడీ నాగముని తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-26T06:08:20+05:30 IST