ప్రభుత్వ పథకాలతో ప్రతీ కుటుంబానికి లబ్ధి

ABN , First Publish Date - 2021-06-21T05:13:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాలతో ప్రతీ కుటుంబానికి లబ్ధి
సూగూరులో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

- వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

- పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, శంకుస్థాపన


శ్రీరంగాపురం/పెబ్బేరు రూరల్‌, జూన్‌ 20 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు, శ్రీరంగాపురం మండలాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సం దర్భంగా ఆయా గ్రామాల్లో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు చే శారు. కంచిరావుపల్లి, కంభలాపూర్‌, శ్రీరంగాపూర్‌, వెంకటాపూర్‌, సూగూరు, జనుంపల్లి, శాగా పురం గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించారు. అలాగే కంచిరావుపల్లి, కమలాపూర్‌, శ్రీరంగా పురం, వెంకటాపురం, సూగూరు, జనుంపల్లి, శాగాపురం గ్రామాల్లో వైకుంఠధామాలను ప్రారం భించారు. శ్రీరంగాపురంలో రూ.10 కోట్లతో నిర్మించిన గోదాములు ప్రారంభించారు. సూగూరులో రూ.10 కోట్ల నిర్మించనున్న గోదాములకు భూమి పూజ చేశారు. పాతపల్లి, గుమ్మడం గ్రామాలలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపస చేశారు. అనంతరం ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల వి ద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణానది నీటి సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరితో తెలంగాణ రాష్ట్రం నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌పై అవాకులు చె వాకులు మాని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ సాగునీటి ప్రాజెక్టులను నిలిపి వే యించేందుకు యత్నించాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో పెబ్బేరు, శ్రీరంగాపురం ఎం పీపీలు శైలజ, గాయత్రి, జడ్పీటీసీ పద్మ, రాజేంద్రప్రసాద్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు గౌని కోదం డరాంరెడ్డి, జగన్నాథంు, మండల రైతు సమన్వయ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T05:13:50+05:30 IST