ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీతో సీమ విద్యార్థులకు మేలు

ABN , First Publish Date - 2021-06-20T04:48:34+05:30 IST

కడపలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ రాయలసీమ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు.

ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీతో సీమ విద్యార్థులకు మేలు
వైస్‌ చాన్సలర్‌తో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

కడప (ఎడ్యుకేషన్‌), జూన్‌ 19 : కడపలో కొత్తగా ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్శిటీ రాయలసీమ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. శనివా రం కడపలోని యూనివర్శిటీని సందర్శించడంతో పాటు వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ విజయకిశోర్‌ను కలిసి యూ నివర్శిటీలో మౌలిక సదుపాయాలు, కొత్త కోర్సుల గురించి తెలుసుకున్నారు. నేటి ఆధునిక సమాజానికి అవసరమైన కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు మంచి నైపుణ్యాలు సాధించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలు ఎక్కువగా పొందుతారన్నారు. అందుకే శాసనమండలిలో యూనివర్శిటీ బిల్లును స్వాగతించడంతో పాటు విలువైన సూచనలు కూడా ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు.  యూనివర్శిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు కంభం బాలగంగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇలియాస్‌బాషా పాల్గొన్నారు.

ఒప్పంద అధ్యాపకులకు స్కేలు వర్తింపు హర్షణీయం

రాష్ట్రంలోని కేజీబీవీ గురుకులాలు, మోడల్‌ స్కూలు, యూనివర్శిటీల్లోని ఒప్పంద ఉపాధ్యాయ అధ్యాపకులకు ఏప్రిల్‌ 2019 నుంచి మినిమం టైం స్కేలు వర్తింప చేయడం హర్షణీయమని ఎమ్మెల్సీ కత్తి నర సింహారెడ్డి అన్నారు. అమలులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులు 12, 24 కొందరికి వర్తింపజేసి మరికొన్ని మేనేజ్‌మెంట్లలోని వారికి వర్తింపజేయనందున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కామన్‌ ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. జీవో నెం.25 ప్రకారం చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు.

Updated Date - 2021-06-20T04:48:34+05:30 IST