వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు లబ్ధి

ABN , First Publish Date - 2022-01-19T05:49:40+05:30 IST

వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు ఎంతో లబ్ధి కలుగుతుందని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు.

వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు లబ్ధి
రైతుకు పవర్‌ వీడర్‌ను అందిస్తున్న పీవో గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి


ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

పాడేరు, జనవరి 18: వ్యవసాయ యాంత్రీకరణతో రైతులకు ఎంతో లబ్ధి కలుగుతుందని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. ఐటీడీఏ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ 57 మంది గిరిజన రైతులకు పవర్‌ వీడర్ల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అవి దుర్వినియోగం కాకుండా జియో ట్యాగింగ్‌ చేస్తామన్నారు. ఏజెన్సీలో 38 వేల హెక్టార్లలో పండ్ల తోటల పెంపకానికి రూ.144 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించా మన్నారు. జీకేవీధి మండలంలో ఇకో ఫల్పింగ్‌ యూనిట్‌ నెలకొల్పడానికి 10 ఎకరాల భూమిని గుర్తించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ యంత్రాలు పంపిణీ చేయడానికి కృషి చేశామన్నారు. ట్రైకార్‌ చైర్మన్‌ సతక బుల్లిబాబు మాట్లాడుతూ.. గిరిజన రైతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రూ.లక్ష 17 వేల విలువైన పవర్‌ వీడర్‌ను 90 శాతం రాయితీపై ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సొనారి రత్నకుమారి, వైస్‌ ఎంపీపీ-2 కనకాలమ్మ, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఎం.గాయత్రి, సర్పంచ్‌ కె.ఉషారాణి, పీహెచ్‌వో శెట్టి బిందు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:49:40+05:30 IST