‘బేకింగ్‌’తో బేఫికర్‌!

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

బేకింగ్‌ సోడా... వంటల్లో తరచుగా వాడే పదార్థం. అయితే దీంతో ఇతరత్రా ఉపయోగాలూ ఉన్నాయి. అవేమిటంటే...

‘బేకింగ్‌’తో బేఫికర్‌!

బేకింగ్‌ సోడా... వంటల్లో తరచుగా వాడే పదార్థం. అయితే దీంతో ఇతరత్రా ఉపయోగాలూ ఉన్నాయి. అవేమిటంటే...


చర్మం తాజాగా: ముఖం జిడ్డు వదలి, చర్మ రంధ్రాలు శుభ్రపడాలంటే, ఫేస్‌ మాస్క్‌లో చిటికెడు బేకింగ్‌ సోడా కలపాలి. 

గుండె ఆరోగ్యం: గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడకుండా ఉండాలంటే పావు గ్లాసు నీళ్లలో, ఒక టీ స్పూను బేకింగ్‌ సోడా కలిపి రోజూ క్రమం తప్పకుండా తాగుతూ ఉండాలి. 

చుండ్రు: చుండ్రు సమస్య వేధిస్తుంటే, నిమ్మరసంలో బేకింగ్‌ సోడా కలిపి, తలకు పట్టించి మర్దన చేయాలి. గంట తర్వాత ఎక్కువ నీళ్లతో తల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చుండ్రు దరిచేరదు.




మృతకణాలు: ముఖం మీద మిగిలిపోయే మృతకణాలు వదలాలంటే, మాయిశ్చరైజర్‌కు చిటికెడు బేకింగ్‌ సోడా చేర్చి, అది కరిగేదాకా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, మృదువుగా రుద్దుకుని, కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే, చర్మం కాంతిమంతంగా తయారవుతుంది.

Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST