Abn logo
Mar 7 2021 @ 17:33PM

మోదీ వ్యాఖ్యలపై సీఎం మమత ఫైర్

కోల్‌కతా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆదివారం మాట్లాడుతూ "పోరిబోర్టన్" (మార్పు) బెంగాల్‌లో కాకుండా ఢిల్లీలో జరుగుతుందని అన్నారు. "అశోల్ పోరిబోర్టన్" (నిజమైన మార్పు) పై మీకు నమ్మకం కలిగించడానికి తాను ఇక్కడకు వచ్చినట్లు కోల్‌కతా ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.


బెంగాల్‌లో మహిళలకు భద్రత ఉండదని మోదీ మాట్లాడుతున్నారని సీఎం మమత మండిపడ్డారు. బెంగాల్ రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా ఉన్నారని సిలిగురిలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పేర్కొన్నారు. కానీ యూపీ, బీహార్ రాష్ట్రాల వైపు చూడాలని మమతా తెలిపారు.